UPSC 2024 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1,930 ఉద్యోగాలు
UPSC ESIC Nursing Officer Recruitment 2024: యూపీఎస్సీ మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ (Nursing Officer) పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1930 Nursing Officer పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 7వ తేదీ నుంచి మార్చి 27వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు లింక్ ఇదే.. క్లిక్ చేయండి. Click Here
SSC : డిగ్రీ అర్హతతో 4187 ఎస్‌ఐ ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది
SSC Delhi Police SI CAPF Notification 2024 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2024కు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. SSC ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన (CAPF) బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో ఎస్‌ఐ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28వ తేదీ దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు లింక్ ఇదే.. క్లిక్ చేయండి.Click Here
BEL Careers : భారత్ ఎలక్ట్రానిక్స్‌లో 517 ట్రైనీ ఇంజినీర్ జాబ్స్.. రూ.40,000 వరకూ జీతం
BEL Recruitment 2024 : భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగళూరు కాంప్లెక్స్- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్ అండ్ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్ (Trainee Engineers) నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 517 ట్రైనీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 13 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు లింక్ ఇదే.. క్లిక్ చేయండి
SAIL OCTT Recruitment 2024 : ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌లో 314 ఉద్యోగాలు
ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL).. భారీ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ (ట్రైనీ)-(OCTT) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 314 ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మార్చి 18వ తేదీకు అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
SSC Selection Post Phase 12 Recruitment 2024 : గుడ్‌న్యూస్.. 2049 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా సెలక్షన్ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లో 2049 ఖాళీలను భర్తీ చేయనుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు లింక్ ఇదే.. క్లిక్ చేయండి
RRB Technician Recruitment 2024 : రైల్వేలో 9144 టెక్నీషియన్ ఉద్యోగాలు.. అప్లయ్ చేసుకోడానికి లింక్ ఇదే
రైల్వే శాఖ.. తాజాగా మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,144 టెక్నీషియన్ (Technician) పోస్టులను దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో వివిధ విభాగాల్లో భర్తీకి రైల్వే శాఖ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు 1092 ఉండగా.. టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 వరకు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 21 RRB రీజియన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 8వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు లింక్ ఇదే.. క్లిక్ చేయండి
0 comments:
Post a Comment