BEL Recruitment 2024 : భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగళూరు కాంప్లెక్స్- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్ అండ్ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 517 ట్రైనీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. మార్చి 13 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bel-india.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
ముఖ్య సమాచారం :
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు: 517
జోన్‌ల వారీ ఖాళీలు: సెంట్రల్ జోన్- 68, ఈస్ట్ జోన్- 86, వెస్ట్ జోన్- 139, నార్త్ జోన్- 78, నార్త్ ఈస్ట్ జోన్- 15, సౌత్ జోన్- 131 ఉన్నాయి.
అర్హత: బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణులై ఉండాలి.
Download Complete Notification
0 comments:
Post a Comment