Sail : ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌లో 314 ఉద్యోగాలు.. ఉండాల్సిన అర్హతలివే

SAIL OCTT Recruitment 2024 : ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (Sail).. భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఆపరేటర్‌ కమ్‌ టెక్నిషియన్‌ (ట్రైనీ)-(OCTT) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 314 ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 18వ తేదీకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అలాగే పూర్తి వివరాలకు https://sail.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు

మొత్తం ఖాళీలు : 314

ఓసీటీటీ-మెటలర్జీ పోస్టులు : 57

ఓసీటీటీ-ఎలక్ట్రికల్‌ పోస్టులు: 64

ఓసీటీటీ-మెకానికల్‌ పోస్టులు: 100

ఓసీటీటీ-ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పోస్టులు: 17

ఓసీటీటీ-సివిల్‌ పోస్టులు: 22

ఓసీటీటీ-కెమికల్‌ పోస్టులు: 18

ఓసీటీటీ-సిరామిక్‌ పోస్టులు: 06

ఓసీటీటీ-ఎలక్ట్రానిక్స్‌ పోస్టులు : 08

ఓసీటీటీ-కంప్యూటర్‌/ఐటీ పోస్టులు: 20

ఓసీటీటీ- డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులు: 02

ముఖ్య సమాచారం :

అర్హతలు : 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు మెటలర్జీ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్ ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, మెకానికల్‌, కెమికల్‌, సిరామిక్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజినీరింగ్‌ డిప్లొమా చేసి ఉండాలి. ఓసీటీటీ- డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుకు ఏడాది పాటు డ్రాఫ్ట్స్‌మ్యాన్/డిజైన్‌గా పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ. 500.. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు రూ. 200గా నిర్ణయించారు.
పరీక్ష కేంద్రాలు: దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 18, 2024
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top