SSC CPO Notification: 4187 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

Delhi Police and Central Armed Police Forces Examination, 2024: ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF- (బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ) విభాగాల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 5న ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 28 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులకు మే 9, 10, 13 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఎంపికైనవారిని ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన(సీఏపీఎఫ్‌) బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల్లో భర్తీచేస్తారు. 
ఖాళీల సంఖ్య: 4,187.

1) సీఏపీఎఫ్ - సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (జీడీ): 4,001 పోస్టులు

2) ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు: 125 పోస్టులు

3) ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- మహిళలు: 61 పోస్టులు

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.08.2024 నాటికి 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: సీబీటీ రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం.

జీతభత్యాలు: నెలకు రూ.35,400-రూ.1,12,400 ఇస్తారు. ఇతర భత్యాలు అదనం.

ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 28.03.2024.

➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 28.03.2024.

➥ దరఖాస్తు సవరణ తేదీలు: 30.03.2024 నుంచి 31.03.2024 వరకు.

➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: మే 9, 10, 13 తేదీల్లో.

Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top