SSC CGL Notification 2024 : డిగ్రీ అర్హతతో.. 17,727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష-2024కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. SSC CGL 2024 పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని మొత్తం 17,727 గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికై SSC దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
SSC MTS Notification 2024 : 10th Class అర్హతతో 8,326 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లికేషన్ లింక్ ఇదే
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించిన SSC MTS 2024 నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8,326 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జనరల్ సెంట్రల్ సర్వీస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు జులై 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
IBPS Clerk Notification 2024 : డిగ్రీ అర్హతతో.. 6128 క్లర్క్ ఉద్యోగాలు బ్యాంక్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP)-XIV నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6128 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జులై 1వ తేదీ నుంచి 21 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు.
PNB Apprentice Recruitment 2024 : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 2700 అప్రెంటిస్ ఖాళీలు న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం.. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా పీఎన్‌బీ శాఖల్లో 2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 27 పోస్టులు.. తెలంగాణలో 34 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు
0 comments:
Post a Comment