నిరుద్యోగులకు శుభవార్త... పదో తరగతి అర్హతతో 8,326 పోస్టులకు ఎస్ఎస్‌సి (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం 8,326 పోస్టుల్లో 4,887 ఎమ్‌టిఎస్ పోస్టులు కాగా, 3,439 హవాల్దార్ పోస్టులు ఉన్నాయి.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్‌ఎస్‌సీ 2024-25 ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్-సీ నాన్ గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్), హవల్దార్ (గ్రూప్-సీ నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హులు:
పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు
ముఖ్యమైన తేదీలు:
జూలై 31 వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత సంవత్సరం ఈ నోటిఫికేషన్ ద్వారా 1,558 ఖాళీలు భర్తీ అయిన సంగతి తెలిసిందే.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు: 8,326
విభాగాల వారీగా ఖాళీలు:
ఎంటీఎస్: 4,887
హవల్దార్: 3,439
అర్హత:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులకు పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదోతరగతి పాసై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
వయసు:
ఎంటీఎస్ పోస్టులకు అభ్యర్థులు 18-25 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. హవల్ధార్ పోస్టులకు 18-27 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 18000 నుంచి రూ. 22000 వరకుఅందిస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ, మాజీ సైనికులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు కలిగించారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ:
27-06-2024
దరఖాస్తుకు చివరి తేదీ:
31-07-2024
0 comments:
Post a Comment