NCC Special Entry Scheme: డిగ్రీ అర్హతతో 'ఆర్మీ'లో ఆఫీసర్ పోస్టులు - ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ నోటిఫికేషన్ విడుదల

Indian Army NCC Special Entry Scheme 57th Course: ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 57వ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు 2025 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 11న ప్రారంభంకాగా.. ఆగస్టు  9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

వివరాలు..

➥ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (57వ కోర్సు) -  షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ) ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 76

1) ఎన్‌సీసీ (మెన్): 70 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ కేటగిరీ-63, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-07.

2)  ఎన్‌సీసీ (ఉమెన్): 06 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్ కేటగిరీ-05, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి-01.

అర్హతలు..

✦ కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు ఎన్‌సీసీ‌ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వీరికి ఎన్‌సీసీ సర్టిఫికెట్ అవసరం లేదు. 

✦ మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్‌లో కనీసం బి-గ్రేడ్‌ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్‌ అవసరం లేదు. 

వయోపరిమితి: 01.01.2025 నాటికి 19-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.2000 - 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది రెండు దశల్లో ఈ ప్రక్రియ ఉంటుంది.  స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు ఉంటాయి. స్టేజ్-1లో ఫెయిల్ అయిన అభ్యర్థులను స్టేజ్-2కి ఎంపిక చేయరు, వారు అదే రోజు తిరిగివెళ్లొచ్చు. స్టేజ్-1లో ఎంపిక అయిన అభ్యర్థులకు స్టేజ్-2 ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ఉంటుంది. ఇందులో ఎంపిక అయిన వారికి చివరగా మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్  ఉంటుంది.

శిక్షణ,స్టైపెండ్ వివరాలు:  ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడెమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. నెలకు రూ.56,100 చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో పోసింగ్ ఇస్తారు. వీరికి 6 నెలలపాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. నిర్ణీత పేస్కేలు ప్రకారం ఇతర అలవెన్సులు ఇస్తారు. పనితీరు సక్రమంగా లేకపోయినా, ఆరోగ్య సమస్యలు తలెత్తిన విధుల నుంచి తొలగిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.08.2024.

Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top