దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన జారీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. గతేడాది జనవరిలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ప్రకటన వెలువడాల్సి ఉంది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. అభ్యర్ధుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్్పస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ. పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్ లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment