హిందీ, ఇంగ్లీషేతర భాషల్లో చదువుకున్న నిరుద్యోగులకు కేంద్రం శుక్రవారం భారీ శుభవార్త చెప్పింది. కేంద్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలను ఇక నుంచి ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది.
ఇప్పటివరకు హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. ఇక నుంచి దేశంలోని 15 భాషల్లో అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, కన్నడ, అస్సామీ, బెంగాలీ, తమిళం, ఉర్దూ, గుజరాతీ, కొంకణి, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు.
ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) పరీక్షను మొదటిసారిగా నిర్వహించనున్నారు. నిరుద్యోగులకు భాషతో సంబంధం లేకుండా అందరికీ సమాన అవకాశాలుండాలనే ప్రధాని మోదీ ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. భాషా అవరోధంతో ఏ ఒక్కరూ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి రాకూడదన్నారు. భాషల విషయంపై ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ వినతులు వచ్చాయని వివరించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఎక్కువగా స్టాఫ్ సెలక్షన్ కమిషనే భర్తీ చేస్తుంది. తాజా నిర్ణయంతో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల అభ్యర్ధులకు మేలు జరుగనుంది.
Important Job Notifications:
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి
Join Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment