కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో విశాఖపట్నంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. 1675 సెక్యురిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..కేంద్ర నిఘా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో విశాఖపట్నంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. 1675 సెక్యురిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు:1675
విద్యార్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరతగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.
వయస్సు:
దరఖాస్తుదారుల వయసు 27 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
ముఖ్యమైన తేదీలు:
ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 10, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభమవుతాయి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
అభ్యర్థులను ఎంపిక చేసే విధానం:
టైర్ 1, టైర్ 2, టైర్ 3 రాత పరీక్ష (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
జీతం:
ఎంపికై వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి
Join Telegram Group: https://t.me/apjobs9
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment