SBI PO 2022 మెయిన్స్ పరీక్ష అడ్మిట్ కార్డులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది.
పీవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. జనవరి 30 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్-2022 ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 17న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 30న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
SBI PO Prelims Results చూసుకోండిలా..
➥ అభ్యర్థులు ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్కు వెళ్లాలి. sbi.co.in
➥ అక్కడ హోమ్ పేజీలో కెరీర్స్ (Careers) ట్యాబ్పై క్లిక్ చేయాలి.
➥ అక్కడ SBI PO Mains Admit Card 2022 లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ తర్వాత అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.
➥ లాగిన్ వివరాలు నమోదుచేయగానే.. స్క్రీన్ మీద అడ్మిట్కార్డు కనిపిస్తుంది.
భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాల పేజీని డౌన్లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంటతీసుకెళ్లాలి.
Important Job Notifications:
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి
Join Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment