KVS Recruitment: కేవీల్లో 13,404 ఉద్యోగాల పరీక్ష తేదీలు వచ్చేశాయ్, షెడ్యూలు ఇదే!

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు.
కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలు కేంద్రీయ విద్యాలయం సంగతన్ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు. జవాబు పత్రాల రీవాల్యుయేషన్, రీచెకింగ్ చేసుకోవడానికి అభ్యర్థులకు ఎలాంటి అవకావం ఉండదు. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను అభ్యర్థుల ఈమెయిల్ ఐడీకి పంపుతారు. పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తారు. ఆ తర్వాత ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.

ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీ విడుదల చేస్తారు. అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కటాఫ్ మార్కులతో సహా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ అసిస్టెంట్ కమిషనర్

పరీక్షతేది: 07.02.2023

➥ ప్రిన్సిపల్ 

పరీక్షతేది: 08.02.2023

➥ వైస్ ప్రిన్సిపల్ & పీఆర్‌టీ (మ్యూజిక్)

పరీక్షతేది: 09.02.2023

➥ టీజీటీ

పరీక్షతేది: 12-14 ఫిబ్రవరి 2023

➥ పీజీటీ 

పరీక్షతేది: 16-20 ఫిబ్రవరి 2023

➥ ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ (సివిల్), హిందీ ట్రాన్స్‌లేటర్ 

పరీక్షతేది: 20.02.2023

➥ పీఆర్‌టీ

పరీక్షతేది: 21-28 ఫిబ్రవరి 2023

➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

పరీక్షతేది: 01-05 మార్చి 2023.

➥ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II

పరీక్షతేది: 06.03.2023

➥ లైబ్రేరియన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ & సీనియర్ సెక్రిటేరియట్ అసిస్టెంట్

పరీక్షతేది: 06.03.2023.

Important Job Notifications:



Tentative Schedule of Computer Based Test for Direct Recruitment against Advt. No. 15 & 16. Click Here

వివిధ రకాల కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్  లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి


Join Telegram Group: https://t.me/apjobs9


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top