తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసందే. యూనిఫామ్ సర్వీసెస్, గ్రూప్స్, ఫారెస్ట్, ఎలక్ట్రిసిటీ, వైద్యం.. ఇలా అన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వేలల్లో ఉద్యోగాలు ఉండడంతో ఒక్క విభాగంలో అయినా జాబ్ సాధించాలన్న లక్ష్యంతో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ శుభవార్త చెప్పారు. గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలకు సన్నద్ధమౌతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
వివిధ ప్రభుత్వశాఖల్లో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకున్న 182 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.అలోక్ కుమార్ తెలిపారు. అలాగే, మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, మెయిన్స్‌కు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ నిర్వహిస్తోందని వెల్లడించారు. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్లలో 100 మంది చొప్పున, హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో 200 మంది.. మొత్తం 500 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే స్టడీ సెంటర్లలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు నేరుగా ప్రధాన పరీక్ష శిక్షణకు హాజరు కావాలని, శిక్షణ తీసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ప్రతి అభ్యర్థికి మూడు నెలల పాటు నెలకు రూ.5 వేల చొప్పున స్టయిపెండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు. గ్రూప్-2 ఉచిత శిక్షణకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 20తో ముగియనుంది.అలాగే, గ్రూప్ -2, 3, 4 పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు నెలల కాల వ్యవధితో నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో ఈ శిక్షణ ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి డిగ్రీ మార్కుల ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఈ శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థులు హైదరాబాద్ జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 31 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే అధికారిక వెబ్‌సైట్‌ను లేదా 040-23546552 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు. కాగా, గ్రూప్ -1 ద్వారా 503, గ్రూప్ -2 ద్వారా 783, గ్రూప్-3 ద్వారా 1,365, గ్రూప్-4 ద్వారా 9,168 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి
Join Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment