ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష కొలువులు

వచ్చే పండగల సీజన్‌ అమ్మకాల పై ఇ-కామర్స్‌ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్‌' చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్‌లో ప్రారంభమయ్యే 'బిగ్‌ బిలియన్‌ డేస్‌, 2024' సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది
ఇన్వెంటరీ మేనేజర్లు, వేర్‌హౌస్‌ అసోసియేట్స్‌, లాజిస్టిక్స్‌ కో-ఆర్డినేటర్లు, కిరాణా పార్ట్‌నర్స్‌, డెలివరీ డ్రైవర్స్‌ రూపంలో ఈ ఉద్యోగాల కల్పన ఉంటుందని పేర్కొంది. పండగల సీజన్‌కు ముందే వీరిని రిక్రూట్‌ చేసుకుని అవసరమైన శిక్షణ ఇస్తామని ప్రకటించింది. ఈ నియామకాల్లో దివ్యాంగులైన స్త్రీలే ఎక్కువగా ఉంటారని తెలిపింది. బిగ్‌ బిలియన్‌ డేస్‌, 2024 డిమాండ్‌ను తట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ తొమ్మిది నగరాల్లో కొత్తగా 11 ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో వాల్‌మార్ట్‌ నిర్వహణలోని ఈ ఇ-కామర్స్‌ దిగ్గజం ఎఫ్‌సీల సంఖ్య 83కు చేరింది.

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top