RRC NR Recruitment 2024 : ఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (Railway Recruitment Cell) నార్త్ రైల్వే (Northern Railway) పరిధిలోని డివిజన్, వర్క్ షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,096 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 16 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rrcnr.org/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్యమైన సమాచారం :
మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు: 4,096
విద్యార్హత: టెన్త్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఆర్ఆర్‌సీ వర్క్ షాప్‌లు: క్లస్టర్ ఢిల్లీ, క్లస్టర్ ఫిరోజ్‌పూర్, క్లస్టర్ లఖ్‌నవూ, క్లస్టర్ అంబాలా, క్లస్టర్ మొరాదాబాద్ తదిరత వర్క్ షాపుల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.
ట్రేడ్‌లు: డేటా ఎంట్రీ ఆపరేటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ ,టర్నల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, వెల్డర్, మెషినిస్ట్, ట్రిమ్మర్, క్రేన్ ఆపరేటర్, స్టెనో గ్రాఫర్ తో పాటు తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
వయో పరిమితి: 16.09.2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.100 .ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 16, 2024
మెరిట్ జాబితా వెల్లడి: నవంబర్ 2024
0 comments:
Post a Comment