PGCIL JE Recruitment 2024 : గుర్‌గావ్‌లోని మహారత్న కంపెనీ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL).. తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 38 జూనియర్ ఇంజినీర్, సర్వేయర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.powergrid.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: 38
జూనియర్ ఇంజినీర్ (గ్రేడ్-3/ ఎస్2) (సర్వే ఇంజినీరింగ్)- 15
సర్వేయర్ (గ్రేడ్-4 / డబ్ల్యూ4) - 15
డ్రాప్ట్స్‌మ్యాన్ (గ్రేడ్-4 / డబ్ల్యూ4) - 08
ఇతర ముఖ్యమైన సమాచారం :
అర్హత: ఐటీఐ (డ్రాప్ట్స్‌మ్యాన్ సివిల్/ ఆర్కిటెక్చరల్ డ్రాప్ట్స్‌మ్యాన్), ఇంజినీరింగ్ డిప్లొమా (సివిల్ / సర్వేయర్), బీఈ / బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: జూనియర్ ఇంజినీర్ పోస్టుకు 31 ఏళ్లు, సర్వేయర్, డ్రాఫ్ట్స్‌మాన్ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: పోస్టుల వారీగా చూస్తే.. జూనియర్ ఇంజినీర్ పోస్టుకు రూ.26,000- రూ.1,18,000.. సర్వేయర్, డ్రాఫ్ట్స్‌మాన్ పోస్టులకు రూ.22,000-రూ.85,000 వేతనం పొందొచ్చు.
దరఖాస్తు ఫీజు: జూనియర్ ఇంజినీర్ (సర్వే ఇంజినీరింగ్) పోస్టుకు రూ.300.. సర్వేయర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు రూ.200; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 29, 2024
0 comments:
Post a Comment