Indian Army: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. రూ.2 లక్షల జీతంతో ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు

Indian Army: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. రూ.2 లక్షల జీతంతో ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీ, తాజాగా టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ విజిట్ చేసి సెప్టెంబర్
రక్షణ దళాల్లో చేరాలనుకునే నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. ఇండియన్ ఆర్మీ లేటెస్ట్ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్ ప్రారంభించింది. భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన ఇండియన్ ఆర్మీ, తాజాగా టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ విజిట్ చేసి సెప్టెంబర్ 12లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలు పరిశీలిద్దాం.

ఖాళీల వివరాలు

ఇండియన్ ఆర్మీ తాజా నోటిఫికేషన్‌తో మొత్తం నాలుగు టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది

వయోపరిమితి

దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లేదా సైబర్ సెక్యూరిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థలో కోర్ పెనట్రేషన్ టెస్టింగ్/సీఈమెచ్/ సైబర్ సెక్యూరిటీ‌ విభాగంలో కనీసం మూడేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. లేదా ఇండిపెంటెండ్ కన్సల్టెంట్‌గా పనిచేసి ఉండాలి.

ఫిజికల్ స్టాండర్ట్స్

టెరిటోరియల్ ఆర్మీ నిర్దేశించిన నిర్దిష్ట శారీరక, వైద్య ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థులు ఉండాలి. ఈ ప్రమాణాలు సాధారణంగా ఎత్తు, బరువు, దృష్టి వంటి అంశాలకు సంబంధించి ఉంటాయి.

అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా ఇండియన్ ఆర్మీ అధికారిక పోర్టల్ www.jointerritorialarmy.gov.in ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘ఇండియన్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్- 2024’ అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.

- ఆ తరువాత టెరిటోరియల్ ఆర్మీ అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

- అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ ఫిలప్ చేయాలి.

- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లికేషన్‌కు జత చేయాలి.

- అప్లికేషన్‌ను పోస్ట్ ద్వారా ఆఫ్‌లైన్‌లో నిర్ణీత గడువులోపు పంపాలి.

అడ్రస్ వివరాలు

‘డైరెక్టరేట్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ, ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 4వ అంతస్తు, ఏ బ్లాక్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫీస్ కాంప్లెక్స్, కేజీ మార్గ్, న్యూ ఢిల్లీ-110001’ అనే అడ్రస్‌కు అప్లికేషన్‌‌ను పోస్ట్‌లో పంపాలి.

సెలక్షన్ ప్రాసెస్

అభ్యర్థులకు ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత రాత పరీక్ష, మూడో దశలో ప్రాక్టీస్ టెస్ట్, చివరకు ఇంటర్వ్యూ ఉంటుంది. రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. దీంట్లో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 60 శాతం స్కోర్ చేయాలి. ప్రాక్టీస్ టెస్ట్ కూడా 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ 300 మార్కులకు ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఫిజికల్, మెంటల్ హెల్త్‌పై ఓ అంచనాకు వస్తారు

ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ. 1,39,600 నుంచి రూ.2,17,600 మధ్య లభిస్తుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top