నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈనెల 26న ఉద్యోగ దిక్సూచి కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నరసాపురం వైఎన్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు
పలు కంపెనీల్లో 420 ఉద్యోగాలను భర్తీ చేస్తామని, 10వ తరగతి నుంచి పీజీ వరకూ చదివిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 16–25 ఏళ్ల వయసున్న వారు అర్హులన్నారు. అభ్యర్థులు పశ్చిమ గోదావరి జిల్లా ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్ 9502024765, 7023896277 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
0 comments:
Post a Comment