వై.యస్.ఆర్. జిల్లా లోని B.Ed. / D.Ed. మరియు TET కోర్సులలో ఉత్తీర్ణత చెందిన, గిరిజన నిరుద్యోగులకు తిరుపతి పట్టణములో DSC పై ఉచిత కోచింగు ఇవ్వబడునని తెలియజేయడమైనది.
ఉచిత DSC కోచింగునకు అర్హతలు :
> B.Ed./D.Ed. పూర్తి చేసిన మరియు TET నందు ఉత్తీర్ణత కలిగిన ST నిరుద్యోగ అభ్యర్ధులందరు ఉచిత DSC కోచింగ్కు అర్హులు.
> అభ్యర్థుల వయస్సు మరియు ఇతర అర్హతలు విద్యాశాఖ వారి నిబంధన మేరకు కలిగిఉండాలి.
> అభ్యర్థులు డిగ్రీ మరియు B.Ed / ఇంటర్ D.Ed. మరియు TET యందు ఉత్తీర్ణత పొందిన మార్కుల ప్రకారం తయారు చేయబడిన మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేయబడతారు (లేదా) ఏదైనా స్క్రీనింగ్ పరీక్ష ప్రకారం ఎంపిక చేయబడతారు.
> మహిళలకు 33 1/3 శాతము రిజర్వేషను కలదు.
కావున, B.Ed./D.Ed. మరియు TET కోర్సులలో ఉత్తీర్ణత చెందిన నిరుద్యోగ గిరిజన యువతీ యువకులు వారి పూర్తి బయోడేటాతో పాటు వారి విద్యార్హత, కులధృవీకరణ పత్రము, రేషను కార్డు, ఆధారు కార్డు, పాసుపోర్టు సైజు కలర్ ఫోటోతో పాటు B.Ed./D.Ed. మరియు TET కోర్సులలో ఉత్తీర్ణత సాధించిన ధృవీకరణ పత్రము మరియు ఇతర సంబంధిత ధృవీకరణ పత్రము నకలులను గెజిటేట్ అధికారి వారిచే ధృవీకరించి (Attestation) సదరు అభ్యర్థుల బయోడేటాకు జతపరచి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, కడప, డి - బ్లాక్, కొత్త కలెక్టరేటు నందు, తేదీ :19-08-2024, (సోమవారం) సాయంత్రము .5.00 గంటల్లోపు సమర్పించవలెయును.
0 comments:
Post a Comment