P Police Jobs : ఏపీలో నిరుద్యోగులకు పోలీస్ శాఖ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీపై హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఒకే రోజు కీలక ప్రకటనలు చేశారు.
ఏపీలో పోలీస్ ఉద్యోగాల ప్రకటన కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పోలీస్ శాఖలో 19 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 31, 2023 నాటికి పోలీస్ శాఖలో 19,999 ఖాళీలు ఉన్నట్లు హోంమంత్రి అనిత ఇటీవల ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే 6100 పోస్టుల భర్తీ ప్రక్రియ కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిందన్నారు. నిరుద్యోగులు ఇప్పటికే పోలీస్ శాఖలో పలు ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై తదుపరి ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు.
0 comments:
Post a Comment