AP ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ... ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తోంది. ఏపీ టెట్- జులై 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మైనారిటీ అభ్యర్థులు ఉచిత కోచింగ్ పొందేందుకు అర్హులు. జులై 10వ తేదీ దరఖాస్తుకు గడువు.
కోచింగ్ వివరాలు:
* టెట్ - జులై 2024 ఉచిత కోచింగ్
అర్హత: ఇంటర్, డీఎడ్, డిగ్రీ, బీఎడ్ ఉత్తీర్ణత, ఏపీ రాష్ట్రానికి చెందిన మైనారిటీ (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు. పార్సీలు) అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా లేదా డైరెక్టర్ కార్యాలయం, మైనారిటీల విద్యాభివృద్ధి కేంద్రం, స్వాతి థియేటర్ ఎదురుగా, భవానీపురం, విజయవాడ లేదా కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలోని సంబంధిత ప్రాంతీయ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 10-07-2024.
Download Complete Notification
0 comments:
Post a Comment