SSC GD Constable 2024 : ఉద్యోగార్థులకు భారీ గుడ్‌న్యూస్. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (SSC GD Constable) నియామకాలకు సంబంధించి ఖాళీల వివరాలను సవరిస్తూ తాజాగా రివైజ్‌డ్ నోటీస్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 26,146 కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. తాజాగా భారీ సంఖ్యలో నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దాదాపు 20,471 పోస్టులను అదనంగా చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. త్వరలో దేశ వ్యాప్తంగా వివిధ సాయుధ బలగాల్లో మొత్తం 46,617 కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు ఎస్‌ఎస్‌సీ (Staff Selection Commission) కమిషన్ స్పష్టం చేసింది.
మొత్తం కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ పోస్టులు : 46,617
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్) పోస్టులు: 12,076 (పురుషులు- 10227.. మహిళలు- 1849)
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) పోస్టులు : 13,632 (పురుషులు- 11,558.. మహిళలు- 2,074)
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) పోస్టులు : 9,410 (పురుషులు- 9,301.. మహిళలు- 109)
సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ) పోస్టులు : 1,926 (పురుషులు- 1,884.. మహిళలు- 42)
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) పోస్టులు : 6,287 (పురుషులు- 5,327.. మహిళలు- 960)
అస్సాం రైఫిల్స్(ఏఆర్) పోస్టులు : 2,990 (పురుషులు- 2,948.. మహిళలు- 42)
సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎస్‌ఎస్‌ఎఫ్) పోస్టులు : 296 (పురుషులు- 222.. మహిళలు- 74)
AP DSC Material డీఎస్సీకి ప్రిపరేషన్ కు కావలసిన పూర్తి మెటీరియల్ క్రింది లింక్ నందు అందుబాటులో కలదు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment