Cotton Corporation: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

Cotton Corporation Of India Limited Recruitment: నేవీ ముంబయిలోని 'కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 214 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జూన్ 12న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్నవారు జులై 2 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిచేస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 214.

⫸ అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌): 01 పోస్టు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో న్యాయశాస్త్రంలో డిగ్రీ (3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు) కలిగి ఉండాలి. 
అనుభవం: అడ్వొకేట్‌గా కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా న్యాయసేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు. 

⫸ అసిస్టెంట్‌ మేనేజర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌): 01 పోస్టు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (హిందీ) కలిగి ఉండాలి. డిగ్రీ వరకు ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ ట్రాన్స్‌లేషన్ అర్హత ఉన్నవారికి ప్రాధ్యాన్యమిస్తారు.
అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు. 
 
⫸ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మార్కెటింగ్‌): 11 పోస్టులు
అర్హత: ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్/అగ్రికల్చర్) అర్హత ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. 

⫸ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (అకౌంట్స్‌): 20 పోస్టులు
అర్హత: సీఏ/సీఎంఏ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. 

⫸ జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌: 120 పోస్టులు
అర్హత: 50 శాతం మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. 

⫸ జూనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌):  20 పోస్టులు
అర్హత: 50 శాతం మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. 

⫸ జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌): 40 పోస్టులు
అర్హత: 50 శాతం మార్కులతో బీకామ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. 

⫸ జూనియర్‌ అసిస్టెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌):  01 పోస్టు
అర్హత: డిగ్రీ (హిందీ)/ పీజీ డిగ్రీ (హిందీ). ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ తెలిసి ఉండాలి. సంస్కృతంతోపాటు ఇతర భారతీయ భాషలపై అవగాహన ఉండాలి. జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: ముంబయి/ నేవీ ముంబయి, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్‌, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్.

జీతం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.40,000- రూ.1,40,000. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు రూ.30,000- రూ.1,20,000. ఇతర పోస్టులకు రూ.22,000-రూ.90,000.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 12.06.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.07.2024

Online Application


AP DSC Material డీఎస్సీకి ప్రిపరేషన్ కు కావలసిన పూర్తి మెటీరియల్ క్రింది లింక్ నందు అందుబాటులో కలదు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు

DSC 2024 Complete Study Material

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు Job Notifications వాట్స్అప్ ఛానల్ లో చేరండి https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V



Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top