BSF Constable Recruitment 2024 : కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF).. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 162 ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ గ్రూప్- బీ, సీ (నాన్ గెజిటెడ్) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఎస్‌ఎఫ్ వాటర్ వింగ్ డైరెక్ట్ ఎంట్రీ ఎగ్జామ్-2024 ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 1వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు
మొత్తం ఖాళీలు - 162
ఎస్‌ఐ (మాస్టర్): 07 పోస్టులు
ఎస్‌ఐ (ఇంజిన్ డ్రైవర్): 04 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (మాస్టర్): 35 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (ఇంజిన్ డ్రైవర్): 57 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (వర్క్ షాప్) (మెకానిక్) (డీజిల్/ పెట్రోల్ ఇంజిన్): 03 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (వర్క్ షాప్) (ఎలక్ట్రీషియన్): 02 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (వర్క్ షాప్) (ఏసీ టెక్నీషియన్): 01 పోస్టు
హెడ్ కానిస్టేబుల్ (వర్క్ షాప్) (ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు
హెడ్ కానిస్టేబుల్ (వర్క్ షాప్) (మెషినిస్ట్): 01 పోస్టు
హెడ్ కానిస్టేబుల్ (వర్క్ షాప్) (కార్పెంటర్): 03 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ (వర్క్ షాప్) (ప్లంబర్): 02 పోస్టులు
కానిస్టేబుల్ (క్రూ): 46 పోస్టులు
ముఖ్య సమాచారం :
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఇంటర్ ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్, సెరాంగ్ సర్టిఫికెట్ ఉండాలి.
వయోపరిమితి (01-07-2024 నాటికి): ఎస్సై (మాస్టర్), ఎస్సై (ఇంజిన్ డ్రైవర్) పోస్టులకు 22 నుంచి 28 ఏళ్ల మధ్య; హెచ్‌సీ (మాస్టర్), హెచ్‌సీ (ఇంజిన్ డ్రైవర్), హెచ్‌సీ (వర్క్ షాప్), కానిస్టేబుల్ (క్రూ) పోస్టులకు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు ఎస్‌ఐ పోస్టులకు రూ.35,400-1,12,400.. హెచ్‌సీ పోస్టులకు రూ.25,500- రూ.81,100.. కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700-రూ69,100గా ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఎస్‌ఐ పోస్టులకు రూ.200.. హెచ్‌సీ/ కానిస్టేబుల్ పోస్టులకు రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 1, 2024
0 comments:
Post a Comment