CRP RRBs XIII Common Recruitment Process for Recruitment of Officers (Scale-I, II & III) and Office Assistants (Multipurpose) in Regional Rural Banks (RRBs) Website: www.ibps.in
బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్! దేశవ్యాప్తంగా రీజినల్ రూరల్ బ్యాంకు (RRB)ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే నియామక పరీక్షకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నోటిఫికేషన్ వచ్చేసింది.
కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XIII (CRP)ల ద్వారా గ్రూప్ 'ఎ' ఆఫీసర్స్ (స్కేల్ -1, II & III), గ్రూప్ 'బి' ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి జూన్ 7 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ఐబీపీఎస్ తాజా నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అయితే, ఎన్ని పోస్టుల్ని భర్తీ చేస్తారనే విషయాన్ని మాత్రం నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. ఈ పోస్టులకు విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు చేసుకొనే విధానం, ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు, వేతనం, పరీక్ష కేంద్రాలు తదితర వివరాలతో సవివరమైన నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని https://www.ibps.in/ పేర్కొంది.
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ షెడ్యూల్...
దరఖాస్తుల స్వీకరణ: జూన్ 7 నుంచి జూన్ 27 వరకు
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్(PET): జులై 22 నుంచి 27 వరకు ఐబీపీఎస్ ప్రిలిమ్స్ ఆన్‌లైన్ పరీక్ష ఆగస్టులో నిర్వహిస్తారు.
ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆగస్టు/సెప్టెంబర్‌లో విడుదల చేస్తారు.
మెయిన్/సింగిల్ ఆన్‌లైన్ పరీక్షను సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ఆన్‌లైన్ లేదా ఫిజికల్ మోడ్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అయ్యేముందు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని సూచించారు.
0 comments:
Post a Comment