భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం... కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-01/ 2025 బ్యాచ్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ), యాంట్రిక్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. రాత, శరీరదార్థ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ అందిస్తారు. అనంతరం సేవల్లో చేరతారు.
ప్రకటన వివరాలు:
1. నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
రీజియన్/ జోన్ వారీ ఖాళీలు: నార్త్- 77; వెస్ట్- 66; నార్త్ ఈస్ట్- 68; ఈస్ట్- 34; నార్త్ వెస్ట్- 12, అండమాన్ అండ్ నికోబార్- 03.
2. యాంట్రిక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 60 పోస్టులు
అర్హత: నావిక్ పోస్టులకు 12వ తరగతి (మ్యాథ్స్, ఫిజిక్స్), యాంత్రిక్ పోస్టులకు 10వ లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 01-03-2003 నుంచి 28-02-2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ప్రాథమిక వేతనం: నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700 యాంత్రిక్ పోస్టులకు రూ.29,200,
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 13-06-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2024.
పరీక్ష తేదీలు/ ఈ-అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్:
స్టేజ్-I: సెప్టెంబర్ 2024.
స్టేజ్ -II: నవంబర్ 2024.
స్టేజ్-III: ఏప్రియల్ 2024.
AP DSC Material డీఎస్సీకి ప్రిపరేషన్ కు కావలసిన పూర్తి మెటీరియల్ క్రింది లింక్ నందు అందుబాటులో కలదు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు
DSC 2024 Complete Study Material
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు Job Notifications వాట్స్అప్ ఛానల్ లో చేరండి
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment