Jio offer: దేశంలో అతి పెద్ద టెలికాం సంస్థ అయిన జియో యూజర్లకు గొప్ప ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్లాన్లు అందించింది. విటిలో కొన్ని ప్లాన్ లు అతి తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందిస్తాయి.
ఈ ప్లాన్ లు తక్కువ ధరకే వచ్చినా, ఎక్కువ రోజులు చెల్లుబాటు అవుతాయి మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు మరిన్ని లాభాలను అందిస్తాయి. వీటిలో, రూ. 895 కే 11 నెలల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందించే పాన్ కూడా వుంది.
Jio offer
జియో ఫోన్ యూజర్ల కోసం జియో ఇటీవల తీసుకు వచ్చిన రూ. 895 రీఛార్జ్ ప్లాన్ గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. కానీ, ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ జియో ఫోన్ యూజర్లకు 11 నెలల పాటు అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది.
జియోఫోన్ రూ. 895 ప్రీపెయిడ్ ప్లాన్
జియోఫోన్ రూ. 895 ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ ప్రతి నెలా 28 రోజుల వ్యాలిడిటీ చొప్పున 12 సైకిల్స్ పని చేస్తుంది మరియు 12 సైకిల్స్ కి అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అలాగే, 2GB హై స్పీడ్ డేటా 50 SMS లు మరియు హైస్పీడ్ డేటా ముగిసిన తరువాత 64 Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని కూడా అందిస్తుంది.
ఈ విధంగా 12 సైకిల్స్ కు గాను టోటల్ 336 రోజులు ఈ ప్లాన్ పని చేస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో JioTV, JioCinema మరియు JioCloud యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు టోటల్ 24GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ లాభాలను దాదాపు సంవత్సరం వరకూ అందుకోవచ్చు.
ఈ ప్లాన్ రీఛార్జ్ కోసం చేసే ఖర్చును 11 నెలకు సమానంగా లెక్కగడితే, నెలకు కేవలం రూ. 81 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే, ఈ ప్లాన్ తో నెలకు కేవలం రూ. 81 రూపాయలకే అన్లిమిటెడ్ లాభాలను 28 రోజుల పాటు ఆనందించవచ్చు.
ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ కు మాత్రమే వర్తిస్తుంది...
ReplyDelete