UPSC Recruitment 2024 : ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 312 ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 13వ తేదీ దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://upsc.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు : 312
డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్: 04 పోస్టులు
డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్: 67 పోస్టులు
సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్: 04 పోస్టులు
స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్: 132 పోస్టులు
స్పెషలిస్ట్ గ్రేడ్-III: 35 పోస్టులు
డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్: 09 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్: 04 పోస్టులు
అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II: 46 పోస్టులు
ఇంజినీర్ అండ్ షిప్ సర్వేయర్ కం-డిప్యూటీ డైరెక్టర్ జనరల్: 02 పోస్టులు
ట్రైనింగ్ ఆఫీసర్: 08 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 01 పోస్టు
ఇతర సమాచారం :
మొత్తం పోస్టుల సంఖ్య: 312
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధహత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.25గా నిర్ణయించారు. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివిరి తేదీ: జూన్ 13, 2024
0 comments:
Post a Comment