భారీ శుభవార్త: ప్రభుత్వ బ్యాంకుల్లో 13000పైగా ఉద్యోగాలు.. క్లర్క్, PO,ఆఫీస్ అసిస్టెంట్,మేనేజర్ పోస్టులు

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్‌న్యూస్. దేశంలోని ప్రభుత్వ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్‌లో ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. IBPS రిక్రూట్ మెంట్ ద్వారా దేశంలోని మొత్తం 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్, PO,మేనేజర్ వంటి పోస్టులపై దాదాపు 10 వేల నియామకాలు జరగనున్నాయి. ఇది కాకుండా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో వందల కొద్దీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీలు వేర్వేరుగా ఉంటాయి. వాటి నోటిఫికేషన్లు కూడా విడివిడిగా విడుదలయ్యాయి. దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌ను ఒకసారి చెక్ చేయండి.

IBS RRB: 9995 క్లర్క్, PO ఖాళీలు

IBPS.. CRP RRB XIII (ఆఫీస్ స్కేల్ I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)) 2024 నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దీని ద్వారా 9995 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అంటే క్లర్క్, ఆఫీస్ స్కేల్ పోస్టులపై రిక్రూట్‌మెంట్ ఉంటుంది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ibps.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేయవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 27, 2024.  ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు వయోపరిమితి 28 నుండి 18 సంవత్సరాలు. గ్రూప్ A ఆఫీసర్ కేటగిరీ కింద వచ్చే పోస్టులకు వయోపరిమితి భిన్నంగా ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఉన్న యువత దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సెంట్రల్ బ్యాంక్‌లో 3000 ఖాళీలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూన్ 17లోగా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా అప్రెంటిస్‌షిప్‌కు ఎంపిక ఉంటుంది. ఇది జూన్ 23న నిర్వహించబడుతుంది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలంటే అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలాగే, ఏప్రిల్ 1, 1996 నుండి మార్చి 31,2004 మధ్య జన్మించి ఉండాలి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ https://centralbankofindia.co.in/  ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ చూడండి.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 కంటే ఎక్కువ ఖాళీలు

బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్, జోనల్ సేల్స్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్‌లతో సహా అనేక పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 2, 2024. ఇందులో రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టుకు అప్లయ్ చేయాలంటే అభ్యర్థి గ్రాడ్యుయేషన్ డిగ్రీతోపాటు పీజీ డిగ్రీ/డిప్లొమాతో పాటు ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ (కనీస ఏడాది కోర్సు) ఉండాలి. ఇతర పోస్టులకు గ్రాడ్యుయేట్, CA కలిగి ఉండాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా రెండు వేర్వేరు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఒక నోటిఫికేషన్‌లో 459, మరో నోటిఫికేషన్‌లో 168 ఖాళీలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

SBI SO: SBIలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన SBIలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ (SO)పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతోంది ఈ కేడర్‌లో మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి.  SBI వెబ్‌సైట్ https://sbi.co.in/ ద్వారా అప్లయ్ చేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 27. ఈ నియామకానికి వయోపరిమితి 23 నుండి 32 సంవత్సరాలు. మరింత సమాచారం కోసం SBI SO రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చూడండి.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top