HCL TechBee 2024 : ప్రముఖ దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ ఇంటర్ విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించింది. ఇంటర్న్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేషన్ అందిస్తూ సంస్థలో ఉద్యోగం కల్పిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్‌బీ పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఐటీ సేవలకు తోడ్పడే డిజిటల్ సపోర్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని.. ఏడాది శిక్షణ తర్వాత వారు హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమితులవుతారని ఇంటర్ విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక.. ఆసక్తిగల విద్యార్థులు అప్లయ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
అర్హతలు
ఇంటర్ సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ, ఒకేషనల్ కోర్సుల్లో 75 శాతానికి పైగా మార్కులు తప్పనిసరి.
దరఖాస్తు చేసుకున్న వారికి హెచ్‌సీఎల్ కెరియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
ఇందులో ప్రతిభ చూపిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఎంపికైతే కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఈ మూడు ప్రక్రియల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాన్ని అందజేస్తారు.
మధురై, చెన్నై హెచ్‌సీఎల్ కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. మొదటి మూడు నెలలు తరగతి గది శిక్షణ ఉంటుంది. తర్వాత తొమ్మిది నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. స్టైపెండ్ కింద నెలకు రూ.10 వేలు ఇస్తారు. 12 నెలల పాటు సాగే ప్రోగ్రామ్ ముగిసన తర్వాత హెచ్‌సీఎల్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఉద్యోగం సాధించిన తర్వాత ఏటా రూ. 1.7 లక్షలు నుంచి రూ. 2.2 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఐటీ, సర్వీస్ డెస్క్, బిజినెస్ ప్రాసెస్ విభాగాల్లో ఐటీ సర్వీసెస్, అసోసియేట్లు పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు 7981834205, 9063564875, 8341405102లో సంప్రదించవచ్చని ఇంటర్ విద్యా శాఖ సూచించింది.
ఉన్నత విద్యావకాశం:
ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు బిట్స్‌పిలానీ, ఆమిటీ, ట్రిపుల్‌ఐటీ కొట్టాయమ్, సస్త్రా యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివరాలను https://www.hcltechbee.com/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
0 comments:
Post a Comment