దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఇతర విభాగాల్లో దాదాపు 12,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా చెప్పారు. సేవల విస్తరణ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు. కొత్త ఉద్యోగులకు బ్యాంకింగ్‌పై అవగాహన కల్పిస్తామని, ఆ తర్వాత కొందరిని IT, ఇతర అసోసియేట్ రోల్స్‌లో నియమిస్తామని వివరించారు. మే 9న ఎస్బీఐ 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు.దినేష్ ఖరా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం 11,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను హైర్ చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నాం. వీరిలో చాలా మందిని సాధారణంగా ఇంజనీర్లుగా పేర్కొంటాం. ప్రత్యేకించి మా అసోసియేట్, ఆఫీసర్ లెవల్‌లో దాదాపు 85 శాతం మంది ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ కలిగి ఉన్నారు. వారికి ప్రాథమికంగా బ్యాంకింగ్ కాన్సెప్ట్‌లను పరిచయం చేస్తాం. తర్వాత సంస్థలోని అసోసియేట్ రోల్స్‌లో నియమిస్తాం.’ అని చెప్పారు. ప్రత్యేకంగా టెక్నాలజీ స్కిల్స్ ఉన్న ఉద్యోగులను నియమించుకునేందుకు బ్యాంకు ప్రయత్నిస్తోందని ఖరా చెప్పారు.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి.....
ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
0 comments:
Post a Comment