DRDO Jobs: ఐటీఐ పాస్ అయిన వారికి గుడ్‌న్యూస్.. డీఆర్‌డీవో‌లో భారీగా అవకాశాలు

ఇటీవల కాలంలో అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు నిరుద్యోగులకు అప్రెంటీస్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటి ద్వారా స్టైఫండ్‌తో పాటు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ సాధించవచ్చు. తాజాగా ఐటీఐ పాస్ అయిన వారికి ప్రముఖ రక్షణ రంగ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. రక్షణ శాఖలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (DMRL)లో అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ జారీ అయింది.

అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ apprenticeshipindia.gov.in విజిట్ చేసి మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ర్రికూట్‌మెంట్ ద్వారా టర్నర్, మెకానిస్ట్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఐటీఐ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేస్తారు.

ఖాళీల వివరాలు

డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీలో మొత్తంగా 127 ఐటీఐ అప్రెంటీస్‌షిప్ ఖాళీలను భర్తీ చేస్తారు. అందులో ఫిట్టర్ 20, టర్నర్ 8, మెషినిస్ట్ 16, వెల్డర్ 4, ఎలక్ట్రీషియన్ 12, ఎలక్ట్రానిక్స్ 4, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 60, కార్పెంటర్ 2, బుక్ బైండర్ ఒక పోస్ట్ భర్తీ కానున్నాయి.

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్

దరఖాస్తుదారులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. అయితే NCVT, SCVT నుంచి ITI అర్హత పరీక్ష క్వాలిఫై అయిన రెగ్యులర్ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉన్నత విద్య చదివిన విద్యార్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోకూడదు. ఒకవేళ అప్లై చేసినా, వారిని ఎంపిక చేయరు.

వయో పరిమితి

అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్టంగా 55 ఏళ్లలోపు ఉండాలి.

అప్లికేషన్ ప్రాసెస్

- ముందుగా అప్రెంటిస్‌షిప్ ఇండియా అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.org ఓపెన్ చేయాలి.

- హోమ్‌పేజీలోకి వెళ్లి, DMRL DRDO అప్రెంటిస్‌షిప్-2024 లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.

- ‘అప్లై నౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

- అనంతరం రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి. అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ నింపాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, చివరగా ఫారమ్‌ను సబ్‌మిట్ చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్స్

DMRL ఐటీఐ అప్రెంటీస్‌షిప్‌ అప్లికేషన్ ప్రాసెస్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో కొన్ని సర్టిఫికేట్స్ తప్పనిసరిగా అవసరం అవుతాయి. యాక్టివ్ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ (పదో తరగతి, ఐటీఐ), ఏజ్ ఫ్రూప్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్, డిజిటల్ సైన్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్, ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్ బుక్ కాపీ, ఆధార్ కార్డ్, అడ్రస్ ఫ్రూఫ్, కాస్ట్ సర్టిఫికేట్ వంటివి తప్పనిసరిగా సబ్‌‌మిట్ చేయాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

ముందు పదోతరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

ట్రైనింగ్ వివరాలు

సెలక్ట్ అయిన వారికి హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీలో ట్రైనింగ్ ఉంటుంది. సంబంధిత ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. అప్లై చేసుకునే సమయంలో ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపికయ్యే అభ్యర్థులకు స్టైఫండ్ ఎంత ఉంటుందో డీఆర్‌డీవో ఇంకా ప్రకటించలేదు. 1961 అప్రెంటీస్ చట్టం ప్రకారం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు  కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి.....


ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ టెలిగ్రామ్ గ్రూపులో చేరండి


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top