NIPFP Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నోటిఫికేషన్ వెల్లడైన 30 రోజుల్లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 12
విభాగాల వారీగా ఖాళీలు..
⏩ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.67,700.
⏩ రిసెర్చ్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమానం, ఎంసీఏ, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.56,100.
⏩ ఎస్టేట్ ఆఫీసర్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.56,100.
⏩ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 02 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.44,900.
⏩ సూపరింటెండెంట్ (కంప్యూటర్): 01 పోస్టు
అర్హత: బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్ & టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా తత్సమానం, ఎంసీఏ, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.44,900.
⏩ సీనియర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01 పోస్టు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్) లేదా బ్యాచిలర్స్ డిగ్రీ (లైబ్రరీ / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.35,400.
⏩ క్లర్క్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, లేదా తత్సమానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.25,500.
⏩ డ్రైవర్ గ్రేడ్-II: 01 పోస్టు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత, చెల్లుబాటు అయ్యే కారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. మోటార్ మెకానిజంపై జ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.19,900.
⏩ మాలి: 01 పోస్టు
అర్హత: మెట్రిక్యులేషన్, గార్డెనింగ్‌లో ప్రాథమిక పరిజ్ఞానం, హిందీలో ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.18,000.
⏩ మెసెంజర్: 01 పోస్టు
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీషు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.18,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: పోస్టులని అనుసరించి రాత/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Secretary, National Institute of Public Finance and Policy,
18/2 Satsang Vihar Marg, Special Institutional Area New Delhi – 110 067.
ముఖ్యమైనతేదీలు..
🔰 నోటిఫికేషన్ వెల్లడి తేదీ: 02.05.2024.
🔰 దరఖాస్తుకు చివరి తేదీ: నోటిఫికేషన్ వెల్లడి తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
0 comments:
Post a Comment