NIACL: ఎన్‌ఐఏసీఎల్‌ అసిస్టెంట్ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

NIACL Assistant Admitcard: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెయిన్స్ రాతపరీక్ష అడ్మిట్‌కార్డులను ఏప్రిల్ 6న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ఏప్రిల్‌ 13న ఆన్‌లైన విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.37,000 జీతంగా చెల్లిస్తారు. అంతకు ముందు మార్చి 2న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష తేదీ వరకూ హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

NIACL అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ NIACL మెయన్స్ పరీక్ష హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి - newindia.co.in
➥ అక్కడ హోంపేజీలో, 'Recruitment' విభాగాన్ని సందర్శించాలి.
➥ ఆ తర్వత వచ్చే పేజీలో, 'Assistant Recruitment Excercise' విభాగంలోకి వెళ్లాలి. 
➥ NIACL అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష హాల్‌టికెట్లకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతోంది.  
➥ అభ్యర్థులు అక్కడ తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబర, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.  
➥ అభ్యర్థులకు సంబంధించిన హాల్‌టికెట్లు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శనమిస్తాయి.
➥ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని పరీక్షరోజు వెంట తీసుకెళ్లాలి.
Download Admit Cards
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top