SSC CPO Final Results: ఢిల్లీపోలీస్, సీఏపీఎఫ్ ఎస్‌ఐ తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంపికైన 1865 మంది అభ్యర్థులు
SSC CPO Final Results: ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్(SI) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ సీపీవో 2023 తుది ఎంపిక ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్ 6న వెల్లడించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1865 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కాగా 1786 మందితో కూడిన జాబితాను మాత్రమే స్టాప్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వివిధ కారణాల వల్ల 79 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచింది. ఫలితాలతోపాటు కేటగిరీలవారీగా కటాఫ్ మార్కుల వివరాలను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది
0 comments:
Post a Comment