AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల అవుతాయి. ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఫలితాలను రిలీజ్ చేస్తారు.
ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకూ టెన్త్ పరీక్షలు జరిగాయి. మొత్తం 6 లక్షల 30 వేల 633 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాల వేల్యుయేషన్ కోసం 25 వేల మంది టీచర్లను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. దాంతో 22 రోజుల్లోనే వాల్యుయేషన్ పూర్తి చేసి, ఇవాళ విడుదల చేస్తున్నారు. ఇందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చింది.
గతేడాది మే 6వ తేదీన ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈసారి కాస్త ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఏపీ SSC బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in లో విద్యార్థులు తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Results Websites:
0 comments:
Post a Comment