నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHPC)లో అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీ కోసం నోటాఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 57 పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ITI, డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి,అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ NHPC nhpcindia.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 30. అయితే అప్లై చేయడానికి ముందు ఈ వివరాలను చూడండి
ఫిట్టర్- 2 పోస్టులు
ఎలక్ట్రీషియన్ - 13 పోస్టులు
డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) - 2 పోస్టులు
సర్వేయర్ - 2 పోస్టులు
ప్లంబర్- 2 పోస్టులు
COPA (కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ హెల్పర్) - 18 పోస్ట్‌లు
డిప్లొమా అప్రెంటిస్‌షిప్
సివిల్ - 5 పోస్టులు
ఎలక్ట్రికల్- 4 పోస్టులు
GNM - 4 పోస్టులు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్
నర్సింగ్- 2 పోస్టులు
హోటల్ మేనేజ్‌మెంట్-1 పోస్ట్
ఫార్మసిస్ట్ గ్రాడ్యుయేట్- 2 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య- 57
దరఖాస్తు రుసుము
ఏ అభ్యర్థి అయినా దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
విద్యార్హత
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి ఐటీఐ సర్టిఫికేట్, ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా, సంబంధిత ట్రేడ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
0 comments:
Post a Comment