ఎయిమ్స్ మంగళగిరిలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తదితర విభాగాల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయ్యింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ మెడికల్ ఫిజిక్స్, ఎంఏ/ ఎంఎస్సీ సైకాలజీ, క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 90
మొత్తం పోస్టుల కేటాయింపు : యూఆర్-56 పోస్టులు , ఓబీసీ-16 పోస్టులు, ఎస్సీ-09 పోస్టులు, ఎస్టీ-04 పోస్టులు, ఈడబ్ల్యూఎస్-05 పోస్టులు.
వివిధ విభాగాల్లో ఉన్న పోస్టుల వివరాలు..
మెడికల్ ఆఫీసర్ (ఆయూష్): 02
మెడికల్ ఫిజిసిస్ట్ (రేడియేషన్ థెరపీ ఆంకాలజీ) : 1
మెడికల్ ఫిజిసిస్ట్ (న్యూక్లియర్ మెడిసిన్): 1
క్లినికల్ సైకాలాజిస్ట్: 1
చైల్డ్ సైకాలాజిస్ట్: 1
ప్రోగ్రామర్: 1
స్టొర్ కీపర్: 1
జూనియర్ ఇంజినీర్(A/c & R): 1
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 1
మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-II: 02
పర్ఫ్యూషనిస్ట్: 1
అసిస్టెంట్ డైటీషియన్: 02
టెక్నీషియన్స్ (ల్యాబొరేటరీ): 18
టెక్నీషియన్ (ఓటీ) : 06
ఎంబ్రైయోలజిస్ట్ : 01
డెంటల్ టెక్నీషియన్(హైజెనిస్ట్): 1
న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్: 1
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ : 02
లోయర్ డివిజన్ క్లర్క్: 03
ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-II : 01
హాస్పటల్ అటెండెంట్ గ్రేడ్-III(నర్సింగ్ ఆర్డర్లీ): 40
మార్చురీ అటెండెంట్: 02
వయోపరిమితి : వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్/కమిషన్డ్ ఆఫీసర్స్ పోస్టులకు 3 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము : జనరల్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ/ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు రూ.1000. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు హార్డ్‌కాపీకి అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు అందజేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: గ్రూప్ ఏ పోస్టులకు ఇంటర్వ్యూ, గ్రూప్ బీ, సీ పోస్టులకు ఆన్‌లైన్ (సీబీటీ) పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్.
15-03-2024 నోటిఫికేషన్‌ను ప్రకటించారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగానే మరలా తెలియజేయబడుతుంది
0 comments:
Post a Comment