CBSE: సీబీఎస్‌ఈలో 118 గ్రూప్‌ ఎ, బి, సి, పోస్టులు- ఈ అర్హతలుండాలి

CBSE Recruitment: న్యూఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్‌- ఎ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 118 పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 11వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 118

గ్రూప్‌- ఎ పోస్టులు(పే లెవెల్- 10)..

➥ అసిస్టెంట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్) : 18 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూషన్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥అసిస్టెంట్ సెక్రటరీ (అకడమిక్స్): 16 పోస్టులు

సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు..
➛ హిందీ: 01
➛ ఇంగ్లీష్: 01
➛ ఫిజిక్స్: 01
➛ బయాలజీ: 01
➛ కెమిస్ట్రీ: 01
➛ ఎడ్యుకేషన్: 01
➛ సైకాలజీ: 01
➛ ఫిజికల్ ఎడ్యుకేషన్: 01
➛ మ్యాథమెటిక్స్: 01
➛ కామర్స్: 01
➛ ఎకనామిక్స్: 01
➛ హిస్టరీ: 01
➛ పొలిటికల్ సైన్స్: 01
➛ జియోగ్రఫీ: 01
➛ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 01
➛ స్టాటిస్టిక్స్: 01

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లలో పీజీ, బీఈడీ, NET/SLET లేదా తత్సమానం లేదా డాక్టరేట్ డిగ్రీ, ఎంఈడీ / ఎంఫిల్. లేదా తత్సమానం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అసిస్టెంట్ సెక్రటరీ (స్కిల్ ఎడ్యుకేషన్): 08 పోస్టులు

సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు..
➛ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & AI: 02
➛ అగ్రికల్చర్: 01
➛ ఫుడ్ న్యూట్రిషన్ & ఫుడ్ ప్రొడక్షన్: 01
➛ BFSI & మార్కెటింగ్: 02
➛ టూరిజం: 01
➛ బ్యూటీ & వెల్‌నెస్: 01

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో  పీజీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 11.04.2024 నాటికి  18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అసిస్టెంట్ సెక్రటరీ (ట్రైనింగ్): 22 పోస్టులు

సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు..
➛ ఎడ్యుకేషన్: 02
➛ మ్యాథమెటిక్స్: 02
➛ ఫిజిక్స్: 02
➛ కెమిస్ట్రీ: 02
➛ బయాలజీ: 02
➛ కామర్స్: 02
➛ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & కంప్యూటర్ సైన్స్: 02
➛ మల్టీమీడియా & మాస్ కమ్యూనికేషన్: 02
➛ డిజైన్: 02
➛ ఇంగ్లీష్: 02
➛ హిందీ: 02

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లలో పీజీ, బీఈడీ, NET/SLET లేదా తత్సమానం లేదా డాక్టరేట్ డిగ్రీ, ఎంఈడీ / ఎంఫిల్. లేదా తత్సమానం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ అకౌంట్స్ ఆఫీసర్: 03 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత విభాగంలో  బ్యాచిలర్ డిగ్రీ, పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్)/చార్టర్డ్ అకౌంటెంట్/ఐసీడబ్ల్యూఏ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 11.04.2024 నాటికి  18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

గ్రూప్‌- బి పోస్టులు(పే లెవెల్- 6)..

➥ జూనియర్ ఇంజినీర్: 17 పోస్టులు

అర్హత: AICTE చే గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఈ/బీటెక్(సివిల్ ఇంజనీరింగ్‌) కలిగి ఉండాలి.

వయోపరిమితి: 11.04.2024 నాటికి  18-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 07 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 11.04.2024 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

 గ్రూప్‌- సి పోస్టులు..

➥ అకౌంటెంట్(పే లెవెల్- 4): 07 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అండ్ టైపింగ్ వేగం 35 w.p.m. ఆంగ్లంలో లేదా 30 w.p.m. కంప్యూటర్‌లో హిందీలో ఉండాలి.

వయోపరిమితి: 11.04.2024 నాటికి  18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

➥ జూనియర్ అకౌంటెంట్(పే లెవెల్- 2): 20 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం/సంస్థ నుండి 12వ తరగతితో పాటు అకౌంటెన్సీ/బిజినెస్ స్టడీస్/ ఎకనామిక్స్/ కామర్స్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్/ఫైనాన్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ టాక్సేషన్/ కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్‌లలో ఒకటి కలిగి ఉండాలి.

వయోపరిమితి: 11.04.2024 నాటికి 18- 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: గ్రూప్‌- ఎ పోస్టులకు రూ.1500, గ్రూప్‌- బి & సి పోస్టులకు రూ.800 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళలు/రెగ్యులర్ CBSE ఉద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ / డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11.04.2024.

Job Notification Whatsapp Channel...


Job Notification Telegram Channel...


Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top