సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)లో..గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sebi.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 13,2024. అయితే అప్లయ్ చేయడానికి ముందు కింద ఇచ్చిన విషయాలను జాగ్రత్తగా చదవండి.
సెబీ ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద.. జనరల్ స్ట్రీమ్, లా విభాగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్, రీసెర్చ్ విభాగం, అఫీషియల్ లాంగ్వేజ్ విభాగాలలో మొత్తం 97 గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయోపరిమితి ఎంత?
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గరిష్ట వయోపరిమితి మార్చి 31, 2024 నాటికి 30 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ మూడు దశల్లో ఎంపిక చేయబడతారు. మొదటి దశ ఆన్‌లైన్ పరీక్ష, ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. స్టెప్ I పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ స్టెప్ II పరీక్షకు హాజరవుతారు. రెండు పేపర్ల ఆన్‌లైన్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
దరఖాస్తు రుసుము
అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.1000 చెల్లించాలి. అయితే SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులు రుసుముగా రూ. 100 మాత్రమే చెల్లించాలి.
0 comments:
Post a Comment