బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్లకి గుడ్ న్యూస్. BSF గ్రూప్ C కింద హెడ్ కానిస్టేబుల్,కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ రిక్రూట్ మెంట్ కింద మొత్తం 38 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 15. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు పోస్టుల వివరాలు,శాలరీ,ఎంపిక ప్రక్రియ,తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం..వీటికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడండి.
పోస్టుల వివరాలు
హెడ్ కానిస్టేబుల్ (ప్లంబర్) - 01 పోస్ట్
హెడ్ కానిస్టేబుల్ (కార్పెంటర్) - 01 పోస్ట్
కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్) - 13 పోస్టులు
కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్) - 14 పోస్టులు
కానిస్టేబుల్ (లైన్‌మ్యాన్) - 09 పోస్టులు
మొత్తం పోస్టులు-38
వయోపరిమితి
నోటిఫికేషన్ ప్రకారం BSFలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు,గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.
జీతం
హెడ్ కానిస్టేబుల్‌కు ఎంపికైన అభ్యర్థులకు 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ లెవెల్ 04 కింద రూ. 25500 నుండి రూ. 81100 వరకు నెలవారీ జీతం ఇవ్వబడుతుంది.
కానిస్టేబుల్‌కు ఎంపికైన అభ్యర్థులకు 7వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ లెవల్ 03 ద్వారా నెలవారీ జీతం రూ.21700 నుండి రూ.69100 వరకు చెల్లించబడుతుంది.
నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌ని ఇక్కడ చూడండి
0 comments:
Post a Comment