ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశపరీక్ష నోటిఫికేషన్‌ను విడుదలయ్యింది. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఆసక్తి, ఆర్హత గల అభ్యర్థులు వీటికి దరఖాస్తులు చేసుకోగలరు. సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పలు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించింది. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఇంటర్‌మీడియట్‌లో కనీసం 45 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోలరు.
కోర్సు వివరాలు
బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ (సెల్ఫ్ సపోర్ట్ విధానం)
ఎంపిక ప్రక్రియ : ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా ఈ కోర్సుల సీట్ల కేటాయింపు ఉంటుంది. ప్రవేశాల ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తారు.
విద్యార్హత : కనీసం 45 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఇంటర్‌మీడియట్ ఉత్తీర్ణత కలిగిన వారు వీటిని దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. (రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు 40శాతం ఉత్తీర్ణత ఉంటే చాలు).
ఏపీలోని పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు వివరాలు : జనరల్, ఓబిసి అభ్యర్థులకు రూ.1,200 రుసుముగా నిర్ణయించడమైనది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు 1000 రూపాయలు మాత్రమే. ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన ముఖ్య తేదీల వివరాలు..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24-04-2024.
రూ.750 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది: 01-05-2024గా నిర్ణయించడమైనది.
AUEET ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 03-05-2024.
AUEET ఫలితాల విడుదల: 07-05-2024.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన ముఖ్య తేదీల వివరాలు..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24-04-2024.
రూ.750 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది: 01-05-2024గా నిర్ణయించడమైనది.
AUEET ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 03-05-2024.
AUEET ప్రవేశ పరీక్ష తేది: 05-05-2024.
AUEET ఫలితాల విడుదల: 07-05-2024
0 comments:
Post a Comment