SBI Apprentice Results 2023: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 26న విడుదలయ్యాయి.
ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పీడీఎఫ్ ఫార్మాట్లో అప్రెంటిస్ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పొందుపరిచారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఈ ఏడాది కాలం పాటు నెలకు ₹15 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఇతర అలవెన్సులకు అర్హులు కాదు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 6,160 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. వీటిలో ఏపీలో 390 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 125 ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబరు 1 నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు గతేడాది డిసెంబరు 4, 7, 23 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించగా.. తాజాగా ఫలితాలను విడుదలచేశారు.
0 comments:
Post a Comment