Tirupati DWCWE Department Jobs తిరుపతిలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం (DWCWE).. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 పోస్టులను భర్తీ చేయనుంది. ఒప్పంద ప్రాతిపదికన తిరుపతి జిల్లాలో ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 26వ తేదీలోగా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు : 10
సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్- 01
నర్స్- 01
డాక్టర్ (పార్ట్ టైం)- 01
ఆయా(మహిళలు)- 06
చౌకీదార్- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25-42 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, తిరుపతి, తిరుపతి జిల్లా చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 26, 2024.
0 comments:
Post a Comment