నిరుద్యోగ యువకులకు ఇది ఒక మంచి అవకాశం. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి తపాల శాఖ కొన్ని ఏజెంట్లు ఉద్యోగాలకి నియామకాలు చేస్తోంది. ఈ ఏజెంట్ నియామకాలు కూడా ప్రత్యేకించి విశాఖపట్నం ఔత్సాహికులకు చేస్తామని తపాల శాఖ ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. దరఖాస్తులను పరిశీలించి ఉద్యోగాల నియామకాలు చేపడతామని చెప్పింది.
విశాఖపట్నం జిల్లాలో తపాలా శాఖ అందిస్తున్న జీవిత భీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సేవలను విస్తృతం చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తపాలా శాఖ విశాఖపట్నం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ గజేంద్ర కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వివరించారు. పదో తరగ డివిజన్ నందు కమీషన్ ప్రతిపాదికన నియమిస్తామని పేర్కొన్నారు. అన్ని తపాలా కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 30వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వెలంపేటలోని తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం డెవలప్మెంట్ ఆఫీసర్ (పి ఎల్ ఐ) ని మొబైల్ నెం. 8143810007 నందు కాని , తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ కార్యాలయం నందు 0891 - 2546237 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చునని తపాలా శాఖ విశాఖ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ గజేంద్ర కుమార్ మీనా కొరారు.
0 comments:
Post a Comment