రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పలు జాబ్ మేళాలను నిర్వహిస్తోంది. ప్రధానంగా రాష్ట్ర నైపుణ్యాభిృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తుండగా, నిరుద్యోగులు వాటిని సద్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో జాబ్ మేళాలను నిర్వహిస్తూ, డిగ్రీ ఆపై చదువులు చదివిన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు.
జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా నైపుణాభివృధి సంస్థ ఆధ్వర్యములో యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ సహకారంతో ఒంగోలు లోని జిల్లా ఉపాధి కార్యాలయం లో విభిన్న సామర్థ్యం (వికలాంగులు) గల వ్యక్తులకు మాత్రమే స్టీవార్డ్స్, ఫోల్డింగ్ అసిస్టెంట్, క్రూ మెంబర్ - స్టోర్,CSA మరియు DSM/DSW, ప్రాసెస్ & సీనియర్ ప్రాసెస్, స్పెషలిస్ట్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ హెల్ప్ డెస్క్ సపోర్ట్ (L1) మరియు SAP ABAP సెక్టార్ లలో వివిధ రకాల ఖాళీలను భర్తీచేయనున్నారు. 18 సం,, నుండి 35 సం,,మధ్య గల 10 వ తరగతి మరియుఆపై చదువులు పూర్తి చేసిన వారికి ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్థులకు జీతం సంవత్సరానికి, ప్రతి ఏడాది రూ.1.2 నుండి రు.3.1 లక్షల వరకుఇవ్వటం జరుగుతుందన్నారు.
అలాగే సి.జోన్ సిస్టమ్, మాక్స్ (లైఫ్‌స్టైల్ ఇంట్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీలలోCCTV టెక్నీషియన్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్సెక్టార్ లలో వివిధ రకాల ఖాళీలను భర్తీచేయుటకు జిల్లా ఉపాధి కార్యాలయం, ఒంగోలు లో ఈ నెల 23 వ తేదీన (మంగళవారం) ఉదయం 10:00 గం.ల నుండి సాయంత్రం 3గం.ల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, టి.భరద్వాజ్, జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి తెలిపారు. జిల్లాలోని 20సం,, నుండి 25 సం,,మధ్య గల డిగ్రీ మరియు ఆపై చదువు పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూ కు ఆధార్ కార్డు మరియు సరిఫికేట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు
ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు జీతం రూ. 10,000 నుండి రూ.15,000వరకు వరకు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ సదావకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగ పరుచుకోవాలని జిల్లా ఉపాధి అధికారి టి. భరద్వాజ్ తెలిపారు. మరిన్ని వివరాలకు https://rb.gy/hn9m0 లేదా ఆఫీసు పని సమయాలలో 085922 81776 లను సంప్రదించాలని కోరారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
0 comments:
Post a Comment