తెలంగాణ రాష్ట్ర ఉపాధి దోహద శిక్షణ సంస్థ చైర్మన్ సహకారంతో ధృవ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 2న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ డీవైఎస్‌ఓ ఎస్‌ఏ.నయీం తెలిపారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే జాబ్‌మేళాలో 65కు పైగా కంపెనీలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో సుమారు 5వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, బీటెక్, ఎంటెక్‌తోపాటు డిప్లొమా, బీఏ, బీస్సీ, బీకాం, బీఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్, హోటల్ మేనేజ్‌మెంట్, పీజీ కోర్సులు చదివిన వారు ఈ జాబ్‌మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు.
18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు https://formsgleawh1uo5pos6rrt3d6 లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 7097655912 , 8886711991, 9642333668 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మంత్రి కొండా సురేఖ జాబ్‌మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ధృవ్ కన్సల్టెన్సీ ప్రతనిధి మన్మోహన్ పాల్గొన్నారు
0 comments:
Post a Comment