కంచరపాలెం: స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరీయర్ సర్వీస్ సెంటర్లో కర్లికల్, టెక్నికల్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సిహెచ్.సుబ్బిరెడ్డి(క్లరికల్) ఒక ప్రకటనలో తెలిపారు. డాన్ బోస్కో, మెడిప్లస్, సువర్ణభూమి, బిగ్ బాస్కెట్, కెఎఫ్సీ, ఆర్కి హాస్పిటల్, హెటిరో డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్లో 477 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. జూనియర్ కెమిస్ట్, రిటైల్ ట్రైనింగ్ అసోసియేట్, ఫార్మసిస్ట్, జూనియర్ ట్రైనీ, డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, ఫీల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ఆఫీస్ అసిస్టెంట్, అకౌంట్స్, టెలికాలర్, అసిస్టెంట్, రికవరీ, క్లర్కు, బ్రాంచ్ ఇన్చార్జి ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తిచేసిన 18-45 ఏళ్ల మధ్య వయసు గల పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆయా ఉద్యోగాలను బట్టి జీతం నెలకు రూ.11,000 నుంచి రూ.25,500ల వరకు ఉంటుందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment