ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కర్నూలు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి టీజీ భరత్ ఆధ్వర్యంలో TECH M.J. S. అనుబంధంగా ఈనెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సుమారు 18 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు పాల్గొననున్నాయి. ఇందులో ముఖ్యంగాఆధాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, కియా కార్ షోరూం, ఆక్సిస్ బ్యాంక్, Dr. రెడ్డీస్ ల్యాబ్, HDFC, ఫ్లిఫ్కార్ట్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి.
ఇందులో ఎంపికైన వారు కర్నూలు, నంద్యాల, జిల్లాలు అదే విధంగా హైదరాబాద్ లో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు 18 నుండి 30 సంవత్సరాల వయసువారు అయి ఉండాలి. అదే విధంగా, విద్యార్హతకు సంబంధించి దీని కోసం పదవ తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు.
ఇందులో ఎంపికైన వారికి ఉద్యోగి అర్హతను బట్టి జీతం 8000 వేల రూపాయల నుంచి 2.5లక్షల రూపాయలు వరకు ఉంటుంది. ఈ ఉద్యోగ మేళాకు హాజరైయ్యే వారు పూర్తిగా ఫార్మల్ డ్రెస్లో రావాలని పేర్కొన్నారు. అదే విధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. కావునా జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీవీ గ్రూప్ సంస్థ అధికారులు తెలిపారు.
ఉద్యోగ మేళా జరుగు స్థలం..
కర్నూలు పట్టణంలోని మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న విభూ పరిణయ ఫంక్షన హాల్ తేదీ.24-01-2024 సమయం ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ మేళా నిర్వహించనుననారు. ఇతర వివారల కోసం.. 81215 94983, 81213 94983, 87121 94983, 90599 52718 నంబర్లను సంప్రదించవచ్చు. అభ్యర్థులు తమ సందేహాలను తెలుసుకుని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
0 comments:
Post a Comment