IOCL Recruitment 2024 : భారత ప్రభుత్వ రంగ సంస్థ- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL).. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పైప్‌లైన్స్ డివిజన్ పరిధిలోని 5 రీజియన్‌లలో 473 టెక్నికల్/ నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం :
అప్రెంటిస్: 473 ఖాళీలు
ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, టీ అండ్ ఐ, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్/ ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: 12వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 12.01.2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 1, 2024
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: ఫిబ్రవరి 9, 2024 నుంచి ఫిబ్రవరి 18, 2024 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 18, 2024
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://iocl.com/
0 comments:
Post a Comment